పర్యావరణంలో ప్రతికూల మార్పుల నివారణకు సంబంధించి ఇదే నిర్ణయాత్మక దశాబ్దమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఐరాస వాతావరణ సదస్సును ఉద్దేశించి బైడెన్ ప్రసంగించారు. ఇప్పుడు చేపట్టే చర్యలే భవిష్యత్తు తరాలకు పెను ముప్పుల నుంచి రక్షిస్తాయని పేర్కొన్నారు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగేలా గత అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకోవడంపై బైడెన్ క్షమాపణలు తెలియజేశారు. కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం చేస్తున్న ఖర్చులను పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ రంగాల్లో నూతన ఉద్యోగాల కల్పన దిశగా వినియోగించాలని చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)