Skip to main content

Namaste NRI

జో  బైడెన్‌ పునరాలోచించుకుంటే మేలు: ఒబామా సూచన

అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలగాలని సొంత పార్టీ కీలక నేతలే డిమాండ్లను తీవ్ర తరం చేశారు. ఆయన అభ్యర్థిత్వంపై మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా ప్రైవేటుగా ఆందోళన వ్యక్త పరిచారు. పార్టీ సీనియర్‌ నాయకురాలు నాన్నీ పెలోసీ నేరుగా బైడెన్‌కే ఫోన్‌ చేసి, రేసు నుంచి వైదొలగాలని కోరినట్లు తెలిసింది. బైడెన్‌ తప్పుకోకపోతే డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని, చట్టసభపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆమె ఆందోలన వ్యక్తం చేసినట్లు తెలిసింది. బైడెన్‌ అయితే ట్రంప్‌ను ఓడిరచలేరని ఆమె అభిప్రాయపడుతున్నారు. బైడెన్‌ వెనక్కి తగ్గాలని కాలిఫోర్నియా డెమోక్రటిక్‌ ప్రతినిధి ఆడమ్‌ కూడా కోరారు. దీంతో పార్టీ ప్రతినిధి తొలిసారిగా బహిరంగంగా పిలుపునిచ్చినట్లు అయింది.

Social Share Spread Message

Latest News