Namaste NRI

జో బైడెన్ సరదా వ్యాఖ్యలు … వారిద్దరినీ రక్షించడానికి నేను

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  నవ్వులు పువ్వులు పూయించారు. ఐదు నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌లను రక్షించడానికి తాను అంతరిక్షానికి వెళ్లవచ్చునని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. వారిద్దరినీ తాను వెనుకకు తీసుకురా వచ్చునని చెప్పి బైడెన్ అందరినీ నవ్వించారు. పెరూ అధ్యక్షుడు డీనా బొలార్టే జెగర్రాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అంతరిక్ష పరిశోధనలపై చర్చించిన సందర్భంలో బైడెన్ ఈ మేరకు చమత్కరించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న వ్యక్తి, ఫ్లోరిడా మాజీ సెనేటర్ (నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌ను ఉద్దేశించి) నాకు చాలా సన్నిహితుడు. నన్ను అంతరిక్షాన్కి పంపించేయవలసిందిగా అతనికి ఫోన్ చేసి చెబుతానని నా భార్య అంటుంద. నన్ను కట్టడి చేయడం కష్టంగా ఉందని ఆమె భావించిన ప్రతిసారీ అంతరిక్షంలోకి పంపిస్తానని చెబుతుంటుంది.  అంతరిక్షానికి పంపిస్తారేమోనని నాకు కొంచెం ఆందోళనగా ఉన్నది. ఎందుకుంటే తిరగి తీసుకురావలసిన మన వ్యోమగాములు అక్కడ ఉన్నారు  అని బైడెన్ నవ్వుతూ చెప్పారు. ఇక అమెరికా, పెరూ అంతరిక్ష పరిశోధనలో పరస్పరం సహకరించుకుంటున్నాయని బైడెన్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events