Namaste NRI

ఉక్రెయిన్‌కు జో బైడెన్‌ చేసిందేమీ లేదు..

యూరప్‌ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పోలాండ్‌ పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బైడెన్‌ పోలాండ్‌లోని ఉక్రెయిన్‌ అగ్ర నేతలతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌ రష్యా మధ్య సాగుతున్న యుద్ధం, తాజా పరిస్థితులపై బైడెన్‌ చర్చించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ ఎంపీ ఇన్నా సోవసన్‌ బైడెన్‌  చేసిన ప్రసంగంపై విమ్శలు గుప్పించారు. రష్యా ప్రతిరోజూ బాంబులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపుడుతున్నా బైడెన్‌ చేసిందేమీ లేదని, కనీసం సహాయం కూడా చేయలేదని ఆమె ఆక్షేపించారు. ఉక్రెయిన్‌ ప్రజలకు భరోసా, ఉపశమనం కల్పించే ఒక మాట కూడా బైడెన్‌ నోట రాలేదని ఆమె మండిపడ్డారు. నేను చాలా ముక్కుసూటిగానే మాట్లాడతా. మాకు భరోసా కల్పించే మాటలు బైడెన్‌ నోట రాలేదు. ప్రస్తుతం మాకు పశ్చిమ దేశాలే ఎక్కువ సహాయం చేస్తున్నాయని అన్నారు. కానీ ఈ ప్రసంగంలో బైడెన్‌ పోలాండ్‌కి మద్దతుగా మాట్లాడినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events