అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆయ న స్వల్ప దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని వైట్‌హౌస్ ప్రెస్‌సెక్రెటరీ కరీన్ జీన్ పియ ర్ తెలిపారు. బైడెన్ ప్రస్తుతం డెలావేర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారని, అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.నేను కొవిడ్-19 టెస్టు లు చేయించుకున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. నా శ్రేయస్సు కోరుకునేవారందరికీ ధన్యవాదాలు. నేను కోలుకునేవరకు అందరికీ దూరంగా ఉంటాను. ఈ సమయంలోనూ అమెరికా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాను అని వెల్లడించారు.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా లాస్ వెగాస్‌లో జరిగిన ఒక సదస్సులో బైడెన్ పాల్గొన్నారు. ప్రసంగానికి ముందుకు కరోనా టెస్టు చేయడంతో అందులో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆయన వెంటనే ఇంటికి చేరుకు న్నారు. తను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఆయనకు పాక్స్‌లోవిడ్ యాంటీ వైరస్ డ్రగ్ ఇచ్చినట్లు తెలిపారు