Namaste NRI

జో బైడెన్ కీలక వ్యాఖ్యలు.. అత్యంత ప్రమాదకర దేశంగా

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్ ఒకటి అని అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా, రష్యా వంటి దేశాలతో విదేశాలతో విదేశాంగ విదానాల గురించి ప్రస్తావిస్తూ పాక్ వైఖరిని తప్పుబట్టారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం దానివల్ల ప్రపంచంపై పడుతున్న ప్రతికూల ప్రభావం గురించి వివరించారు. ఆ దేశం ఇతర దేశాలలో ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉంది అని బైడెన్ వ్యాఖ్యానించారు. 1998 నుంచి పాక్ అణ్వాయుధ ప్రయోగాలు జరుపుతోంది. అయిదే దీనిపై పవ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అణ్యాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని భయపడుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events