Namaste NRI

ఓపెన్‌హైమ‌ర్‌ను చూసిన జో బైడెన్

 అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఆయ‌న భార్య జిల్ బైడెన్‌ తో  దిలావ‌ర్లోని రెహోబోత్ బీచ్ వ‌ద్ద ఉన్న అట్లాంటిక్ థియేట‌ర్‌లో ఓపెన్‌హైమ‌ర్ చిత్రాన్ని చూశారు. క్రిస్టోఫ‌ర్ నోల‌న్ తీసిన ఆ సినిమా ప్ర‌స్తుతం బాక్సాఫీసు వద్ద రికార్డులు బ‌ద్ద‌లుకొడుతోంది. అయితే బార్బీ చిత్రానికి బ‌దులుగా ఆయ‌న ఓపెన్‌హైమ‌ర్‌ను ప్రిఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది.  వైట్‌హౌజ్‌లో కాకుండా ప‌బ్లిక్ స్క్రీనింగ్‌లో బైడెన్ ఫిల్మ్‌ను చూడ‌డం విశేషం. థియేట‌ర్‌లో ఏడో వ‌రుస‌లో ఆయ‌న కూర్చున్నార‌ట‌. మూడు గంట‌లు ఉన్న ఓపెన్‌హైమ‌ర్‌ను బైడెన్ దంప‌తులు ఓపిగ్గా చూశారు. అణు బాంబును డెవ‌ల‌ప్ చేసిన జే రాబ‌ర్ట్ ఓపెన్‌హైమ‌ర్ జీవిత క‌థ ఆధారంగా నోల‌న్ ఆ చిత్రాన్ని తీశారు. ఓపెన్‌హైమ‌ర్ ఫిల్మ్ చాలా ప్రేర‌ణాత్మ‌కంగా ఉంద‌ని బైడెన్ అన్నారు.  భార్య జిల్ బైడెన్‌తో క‌లిసి ఆ ఫిల్మ్‌ను చూసిన‌ట్లు వైట్‌హౌజ్ పేర్కొన్న‌ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events