అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి జైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతు న్నాయి. పిట్స్‌బర్గ్‌లో బైడెన్ మాట్లాడుతూ తన మావయ్య సెకండ్ లెప్టినెంట్ ఆంబ్రోస్ జె.ఫినెగన్ జూనియర్ ను పపువా న్యూగినియాలో నరమాంస భక్షకులు తినేశారని పేర్కొన్నారు. 1944లో న్యూగినియా ఉత్తరతీరంలో ఆంబ్రోస్ ప్రయాణిస్తున్న విమానం కూలింది. ఆ ఘటనలో ఆంబ్రోస్‌తో పాటు మరో ఇద్దరు చనిపోయారు. మృతదేహాలు లభ్యం కాలేదు. దీనిపై బైడెన్ న్యూగినియాలో అప్పట్లో నరమాంస భక్షకులు చాలా మంది ఉండేవాళ్లు అని అన్నారు. అమెరికా సైనిక రికార్డులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు.