అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ క్షమాపణలు చెప్పారు. ఐక్యరాజ్య సమితి కాప్ 27 సదస్సులో బైడెన్ ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన అంశంపై ఈ మేరకు ప్రపంచ దేశాలకు క్షమాపణలను కోరారు. పారిస్ ఒప్పందంలో వెంటనే చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రధాన పర్యావరణ సదస్సులు నిర్వహించామని తెలిపారు. భూతాపాన్ని తగ్గించే పోరాటంలో నాయకత్వాన్ని తిరిగి తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఒక్క సమస్యపై దశాబ్దాలుగా చర్చ కొనసాగుతోంది. పురోగతిలో అడ్డంకులను అధిగమించడానికి అమెరికా చేయవలసిన పరివర్తనాత్మక మార్పులు చేయాలని నిర్ణయించుకునే నేను అధ్యక్ష పదవిలోకి వచ్చాను. అమెరికా ఒక విశ్వసనీయమైన, గ్లోబల్ లీడర్గా వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు సిద్దంగా ఉంది. దానిని సాధించటానికి మా సాయశక్తులా కృషి చేస్తా అని తెలిపారు.