అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక స్థితిపై ఇటీవలే రకరకాల ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడికి పార్కిన్సన్ ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై వైట్‌హౌస్‌లో అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్ కెవిన్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం అధ్యక్షుడి ఆరోగ్యం అద్భుతంగా ఉందని తెలిపారు. ఆయన మెదడు బాగా పనిచేస్తోంది. అంతా అనుకుంటున్నట్లు ఆయనకు పార్కిన్సన్‌కు సంబంధించిన ఎటువంటి సమస్యా లేదు అని స్పష్టం చేశారు. ఆయన పదవీ కాలం ముగిసే నాటికి ఏమైనా మార్పులు ఉంటాయా అని విలేకరు ప్రశ్నించగా, పదవీకాలం ముగిసేనాటికి అధ్యక్షుడి ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు ఏమీ ఉండకపోవచ్చు అని తెలిపారు.