యూరప్ దేశాల పర్యటనలో భాగంగా రష్యా బాంబుల దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ పొరుగు దేశం పోల్యాండ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించారు. రాజధాని వార్సా నగరానికి వెళ్లిన ఆయన పోల్యాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య సాగుతున్న యుద్ధం, తాజా పరిస్థితులు తదితరాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. ఈ వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు దేశాల కూటమిగా ఉన్న నాటోను చీల్చే దిశగా పుతిన్ చాలా యత్నాలే చేశారని ఆరోపించారు. అందులో పుతిన్ ఘోరంగా విఫలమయ్యారని అన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో నాటో కూటమి ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన బైడెన్ ఉక్రెయిన్‌ను ఏకాకిగా చేసేందుకు పుతిన్ నాటోనే చీల్చేందుకు యత్నించి బొక్కబోర్లా పడ్డారని బైడెన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు పుతిన్‌కు పరమకసాయిగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ ఆక్రమణలో రష్యా యుద్ద వ్యూహాన్ని మార్చి ఉంటుందని బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇక బైడెన్‌తో చర్చల అనంతరం అమెరికా స్పందన ఉక్రెయిన్ రక్షణ మంత్రి స్పందించారు. ఈ చర్చల్ని ఆశావాదంగా భావిస్తున్నట్లు తెలిపారు.