న్యూయార్క్‌లోని ట్విటన్ టవర్స్ పై 21 ఏళ్ల క్రితం సెప్టెంబరు 11వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పౌరులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాళులర్పించారు. పెంటగాన్ మెమోరియల్ నుంచి బైడెన్ జాతినుద్ధేశించి ప్రసంగించారు. మన గుండెలు బద్దలైన ఆ దుర్దినాలు మనకు ఇప్పటికే గుర్తే ఉన్నాయి. ఆ ఘోరకలిని దిగమింగుకుని అందరం కలిసి మెలిసి ముందడుగు వేశాం. ఇప్పుడూ అదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని పేర్కొన్నారు. ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ చేసిన ఆ దాడిలో 3000 మంది పౌరులు మరణించారు.
