Skip to main content

Namaste NRI

 జెపి ప్రొడక్షన్స్ మూవీ షురూ

ప్రముఖ నటుడు జయ ప్రకాష్ రెడ్డి కూమార్తె మల్లికా రెడ్డి నిర్మాతగా శ్రీ జయప్రకాష్ రెడ్డి ప్రొడక్షన్స్ (జెపి ప్రొడక్షన్స్) బ్యానర్ పై నరేన్ వనపర్తి కథానాయకుడిగా మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న నూతన చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రంలో పాయల్ గుప్తా కథానాయికగా నటిస్తోంది.   ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు బి గోపాల్ క్లాప్ కొట్టగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు నేను దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది. యువతరం మెచ్చే కథతో తెరకెక్కించబోతున్నాం. ఆగస్ట్‌ నుంచి షూటింగ్‌ మొదలుపెడతాం అన్నారు. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని నిర్మాత మల్లికా రెడ్డి పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శివ, నిర్మాణ సంస్థ: జేపీ ప్రొడక్షన్స్‌, నిర్మాత: మల్లికా రెడ్డి.

Social Share Spread Message

Latest News