ఫైనాన్షియల్ సేవల్లో ఉన్న అమెరికా సంస్థ జేపీ మోర్గాన్ హైదరాబాద్‌లో క్యాంపస్‌ను ప్రారంభించింది. హైటెక్ సిటీ వద్ద సలార్‌పురియా సత్య నాలెడ్జ్ సిటీలో 8,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంస్థకు ఇది అతిపెద్ద కేంద్రం. ఈ కొత్త క్యాంపస్‌లో సాంకేతిక, రిస్క్ ఆపరేషన్, సపోర్ట్ సర్వీస్‌ల సిబ్బంది పనిచేస్తారు. మా వినియోగదారులకు దగ్గరయ్యేందుకు మాకున్న తపనకు ఈ సరికొత్త కార్యాలయం నిదర్శం. అంతేకాదు మా ఉద్యోగులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న వాతావరణ కల్పించడం. హైదరాబాద్‌లోని ప్రతిభావంతులను వినియోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రపంచంలోనే జేపీ మార్గాన్ చేస్‌కు ఉన్న కీలక కార్యాలయాల్లో ఒకటి. ఆసియా పసిఫిక్ విభాగంలో ఇది కీలకమైంది. కంపెనీకి హైదరాబాద్ కీలక ఆర్థిక, సాంకేతిక కేంద్రం అని జేపీ మోర్గాన్ గ్లోబల్ సర్వీసెస్ హెడ్ డేనియల్ వికెనింగ్ తెలిపారు.