అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్ వేమన మాట్లాడుతూ ఎన్టీఆర్ కీర్తి అజరామరమని అన్నారు. ఆయన క్రమశిక్షణ, ఎంచుకున్న సినీ, రాజకీయ రంగం పట్ల అంకితభావం, విప్లవాత్మక నిర్ణయాలు నేటి తరానికి ఆదర్శమన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు.
చింతలపూడి నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమ నిర్మాత, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ నినదించారని అన్నారు. కూటమి విజయం తథ్యమని, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెంది, అమరావతి రాజధాని చరిత్రకెక్కుతుందన్నా రు. భాను మాగులూరి మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితం, ఆయన అనుభవాలు భావి తరాలకు పాఠ్యాంశం కావాలన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి మహానటుడిగా, మహానాయకుడిగా ఎదిగారన్నారు. సాయి బొల్లినేని మాట్లాడుతూ తెలుగు భాషకూ, తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఎన్నారై తెలుగుదేశం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో త్రిలోక్ కంతేటి, సుధీర్ కొమ్మి, అనిల్ ఉప్పలపాటి, సత్య సూరపనేని, జ్యోతి ప్రకాష్, రమేష్ అవిర్నేని, చౌదరి యలమంచిలి, సురేష్ పాలడు గు, చంద్ర మాలావతు, వీర్రాజు, సీతారామారావు, ప్రదీప్ గుత్తా, వెంపరాల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.