ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తెలుగులో అరంగేట్రం చేస్తున్నది. ఎన్టీఆర్, జాన్వీకపూర్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు రాజమౌళి క్లాప్‌నివ్వగా, కొరటాల శివ కెమెరా స్విఛాన్ చేశారు. ప్రశాంత్‌నీల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఎన్టీఆర్‌తో రెండో చిత్రమిది. జనతా గ్యారేజ్ తర్వాత ఆయనతో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. విస్మరణకు గురైన ఓ సుదూర ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. అక్కడ మనుషుల కంటే ఎక్కువగా మృగాలుంటాయి. ఆ మృగాలకు దేవుడంటే, చావంటే భయం లేదు. అలాంటి వాళ్లను భయపెట్టడానికి కథానాయకుడు ఏం చేశాడు? ఏ స్థాయికి వెళ్లాడనేది పంచుతుంది. నా కెరీర్‌లో ఉత్తమ చిత్రమవుతుందనే నమ్మకం ఉంది అని చెప్పారు.
ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు కొరటాల శివ. ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకోకూడదని ఆలోచిస్తున్నాడు కొరటాల. వీలైనంతవరకు ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి, మార్చి చివరివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. డిసెంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీ అవ్వాలని చూస్తున్నాడు. ఏప్రిల్ 5, 2024న ఈ సినిమా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇదే తొలి తెలుగు సినిమా. పైగా ఈ సినిమా కోసం ఆమె 5 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రత్నవేలు, సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్, వీఎఫ్‌ఎక్స్: యుగంధర్, సమర్పణ: నందమూరి కల్యాణ్‌రామ్, రచన-దర్శకత్వం: కొరటాల శివ. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/WB-8.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/d5b7f241-3200-42f7-aeb9-47b1f0e899f3-8.jpg)