Namaste NRI

దీపావళి కానుకగా కె -ర్యాంప్‌

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా రూపొందుతున్న కమర్షియల్‌ ఎంటైర్టెనర్‌ కె -ర్యాంప్‌. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్‌ నాని దర్శకుడు. రాజేష్‌ దండా, శివ బొమ్మకు నిర్మాతలు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. లుంగీ కట్టుకొని చిందేస్తున్న కిరణ్‌ అబ్బవరంని ఈ పోస్టర్‌లో చూడొచ్చు.

బ్యాగ్రౌండ్‌లో మందు బాటిల్స్‌లో డిజైన్‌ చేసిన లవ్‌సింబల్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లో మరో ఫ్రెష్‌ అటెంప్ట్‌ ఈ సినిమా అని మేకర్స్‌ చెబుతున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌రెడ్డి మాసం, సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events