Skip to main content

Namaste NRI

క్రేజీ కల్యాణం సినిమా నుంచి కాకా ధూమ్ ధమాకా సాంగ్ ప్రోమో రిలీజ్

తరుణ్‌భాస్కర్‌, అనుపమ పరమేశ్వరన్‌, అఖిల్‌ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ క్రేజీ కల్యాణం. బద్రప్ప గాజుల దర్శకత్వం. బూసం జగన్‌మోహన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి కాకా ధూమ్‌ ధమాకా అనే పాట ప్రోమోను విడుదల చేశారు.

పెళ్లి బారాత్‌ నేపథ్యంలో వచ్చే పాట ఇదని, మాస్‌ డ్యాన్సుతో ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. సురేశ్‌ బొబ్బిలి స్వరపరచిన ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రచించారు. పూర్తి పాటను ఈ నెల 12న విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ దూపాటి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: బద్రప్ప గాజుల.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events