Namaste NRI

కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తాం

కాకతీయుల చరిత్రను చాటిచెప్పేలా ఈ నెల 7 నుంచి 13 వరకు కాకతీయ వైభవ సప్తాహంను ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌తో కలిసి ఆయన కాకతీయ వైభవ సప్తాహనం కార్యక్రమాల బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ  కాకతీయ వైభవ సప్తాహనం కార్యక్రమాన్ని పండుగ  వాతావరణంలో నిర్వహించాలన్నారు. తెలంగాణ పునర్మిర్మాణంలో సాంస్కృతిక, పునరుజ్జీవం ప్రధానమైందనీ, ఇదే నేపథ్యంతో తెలంగాణ రాష్ట్ర సిద్ధించిన తరువాత కాకతీయ పాలన విధానం ప్రేరణతో ఆనాటి కాకతీయుల గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టారని తెలిపారు.

                కాకతీయ వైభవంను అత్యంత ఘనంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. వేడుకలకు అవసరమైన ఆర్థిక వనరులను ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. వందేళ్లకు ఒకసారి ఇలాంటి సందర్భంగా వస్తుంది కాబట్టి కాకతీయ చరిత్రను భావితరాలకు అందించేలా భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events