భానుశ్రీ, సోనాక్షివర్మ, అనురాగ్ కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం కలశ. కొండ రాంబాబు దర్శకుడు. డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మాత. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిలిం ఛాంబర్లో నిర్వహించారు. ఈ ఈవెంట్లో ‘ఓ చిట్టీ తల్లి’ అంటూ సాగే సాంగ్‌ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ నటులు మురళీమోహన్ ఆవిష్కరించారు. అనంతరం కలశ మూవీ టైటిల్ సాంగ్‌ను దర్శకులు వీర శంకర్ రిలీజ్ చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని చిత్రబృందానికి అతిథులు శుభాకాంక్షలు అందించారు. ఇప్పటివరకూ భారతీయ తెరపై ఇలాంటి కథ రాలేదని, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని నిర్మాత చెప్పారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, గ్రాండియర్‌గా ఈ సినిమా రావడానికి కారకులైన నిర్మాతకు కృతజ్ఞతలు అని దర్శకుడు చెప్పారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/12/news_new_65782.jpg)