సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయే వేడుకు చూద్దాం లాంటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు కల్యాణ్‌కృష్ణ. తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం బంగార్రాజు చిత్రంలో సంక్రాంతికి చక్కటి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు కల్యాణ్‌కృష్ణ. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కుటుంబ విలువలతో తెరకెక్కించి దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నారాయన. తన తదుపరి సినిమా కల్యాణ్‌కృష్ణ స్టూడియోగ్రీన్ ప్రొడక్షన్స్‌లో చేయబోతున్నారు. ఈ చిత్రానికి కె.ఇ. జ్ఞానవేళ్ రాజా నిర్మాత. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ సంక్రాంతికి బంగార్రాజుతో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చారు కల్యాణ్ కృష్ణ. కల్యాణ్‌కృష్ణతో మా బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం అని తెలిపారు.