Skip to main content

Namaste NRI

క‌ల్యాణ్‌రామ్ బర్త్ డే స్పెషల్‌ .. NKR21 అనౌన్స్ మెంట్

నంద‌మూరి  కల్యాణ్ రామ్‌ పుట్టినరోజు సందర్భంగా మూవీ లవర్స్ కు కొత్త సినిమా అప్‌డేట్ అందించాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ చిత్రానికి సైన్ చేశారు. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అధికారికంగా అనౌన్స్ చేశారు. క‌ల్యాణ్‌రామ్ కొత్త ప్రాజెక్ట్‌ NKR21 (వర్కింగ్ టైటిల్‌).  అలా ఎలా అనే ఫీల్ గుడ్ రొమ్-కామ్‌ని నిర్మించిన తర్వాత అశోక క్రియేషన్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ ని నిర్మిస్తోంది. వారు కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ (NTR ఆర్ట్స్) బ్యానర్‌తో కలిసి పని చేస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం 2 గా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ చిత్రం ప్రముఖ తారాగణం, ప్రతిభావంతులైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాల పరంగా ఇది భారీగా ఉంటుంది.కళ్యాణ్ రామ్‌ని మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించడానికి ప్రదీప్ చిలుకూరి ఆకట్టుకునే కథను రాశారు.

Social Share Spread Message

Latest News