సంతోష్ శోభన్, ప్రియ భవానీశంకర్ జంటగా నటిస్తున్న సినిమా కళ్యాణం కమనీయం . ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. పెండ్లి నేపథ్యంగా సాగే కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల మాట్లాడుతూ ప్రధాన పాత్రల్లో సంతోష్ శోభన్, ప్రియా భవానీ నటన మెప్పిస్తుంది. పెండ్లి నేపథ్యంగా సాగే ఆహ్లాదకర చిత్రమిది. సకుటుంబంగా చూసే చిత్రమిదని సెన్సార్ వారు అభినందించారు. క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు. ఆడియోకు మంచి స్పందన వస్తున్నది. సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14న తెరపైకి రాబోతున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – కార్తిక్ ఘట్టమనేని, ఎడిటర్ – సత్య జి, సంగీతం – శ్రావణ్ భరద్వాజ్, సాహిత్యం – కృష్ణ కాంత్, కొరియోగ్రాఫర్స్ – యష్, విజయ్ పోలంకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నరసింహ రాజు, ప్రొడక్షన్ డిజైనర్ – రవీందర్, లైన్ ప్రొడ్యూసర్ – శ్రీధర్ రెడ్డి ఆర్, సహ నిర్మాత – అజయ్ కుమార్ రాజు పి, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, రచన దర్శకత్వం – అనిల్ కుమార్ ఆళ్ల.