Skip to main content

Namaste NRI

మండాడి టీంను అభినందించిన కమల్ హాసన్

ప్రముఖ నటుడు సూరి హీరోగా నటించిన తాజా చిత్రం మండాడి. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, లెజెండరీ నటుడు కమల్ హాసన్ ఈ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. మత్స్యకారుల జీవితాలు మరియు సంప్రదాయ పడవ రేసుల (పాయ్ మార పడగు) నేపథ్యంలో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూరితో పాటు సుహాస్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం రూ. 109.25 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లను సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాను చూసిన క‌మ‌ల్ హాస‌న్ చిత్ర‌బృందానికి క‌లుసుకుని సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

ఇక కమల్ హాసన్‌ను కలవడం తన జీవితంలో మరువలేని క్షణమని హీరో సూరి పేర్కొన్నారు. డాక్టర్ కమల్ హాసన్ సర్, మీ నిస్వార్థమైన ప్రేమ, శక్తివంతమైన మాటలు, దీవెనలు మా మండాడి ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి అంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events