సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు సీనియర్ హీరో కమల్‌హాసన్. హెచ్. వినోద్ దర్శకత్వంలో కమల్‌హాసన్ ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమాలో ఆయన రైతు పాత్రలో నటించబోతున్నారని తెలిసింది. ఇటీవల దర్శకుడు వినోద్‌తో కలిసి కమల్‌హాసన్ ఓ రైతు కేంద్రాన్ని సందర్శించి అక్కడి రైతులతో మచ్చటించారు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ రైతు పాత్రను పోషిస్తున్నారని, వారి కష్టనష్టాలను తెలుసుకునేందుకు రైతు కేంద్రాన్ని సందర్శించారని అంటున్నారు.