
నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లెవెన్. లోకేష్ అజ్ల్స్ దర్శకుడు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎన్.సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. అగ్ర నటుడు కమల్‌హాసన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. వైజాగ్‌లో జరిగే వరుస హత్యలను పరిశోధించే పోలీసాఫీసర్‌గా నవీన్‌చంద్ర పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. సైకో కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో చోటుచేసుకునే సంఘటనలు ఉత్కంఠను పంచుతాయని మేకర్స్ తెలిపారు. రేయా హరి, అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు తదితరులు నటించారు. మే 16న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ అశోకన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: డి.ఇమ్మాన్, దర్శకత్వం: లోకేష్ అజ్ల్స్.
