అగ్ర దర్శకుడు కె.విశ్వనాథ్, ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్ మధ్య గురు శిష్యుల బందం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పటికీ గుర్తుండిపోయే సాగర సంగమం, శుభ సంకల్పం చిత్రాలొచ్చాయి. తరచూ తన గురువు కె.విశ్వనాథ్‌ని కలిసి ఆయనతో కాసేపు సమయం గడుపుతుంటారు కమల్‌హాసన్. హైదరాబాద్‌కి వచ్చిన ఆయన కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి కలిశారు. తన గురువుని కలిశాను. ఆయనంటే నాకెంతో గౌరవం, మాకు ఎన్నో మంచి జ్ఞాపకాలున్నాయి. తన గురువు కె.విశ్వనాథ్ ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు.
