మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న కమల్‌నాథ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాబోతున్నాడా? ఆయన కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కమల్‌నాథ్‌కు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పజెప్పనున్నారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల అనంతరం కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ఈ పదవికి కమల్‌నాథ్ కూడా కేసులో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే కమల్‌నాథ్ సోనియాతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. నాయకత్వ మార్పుపై వీరిమధ్య చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.