అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె తీవ్రమైన వామపక్ష ఉన్మాది అంటూ విమర్శలు గుప్పించారు. అధ్యక్ష అభ్యర్థి రేసు నుంచి బైడెన్ వైదొలగిన అనంతరం ఉత్తర కరోలినాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డెమోక్రటిక్ పార్టీ తరపున తదుపరి అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఉన్న కమలా హారిస్‌పై తీవ్రస్థాjయిలో విరుచుకుపడ్డారు. మూడున్నర సంవత్సరాలుగా బైడెన్ ప్రతి వైపల్యం వెనుకా కమలా హారిస్ ఉన్నారు. ఆమె ఒక తీవ్రమైన వామపక్ష ఉన్మాది. అధికారంలోకి వచ్చే అవకాశం ఇస్తే ఆమె ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.