
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ పేరు ఖరారైంది. ఈ మేరకు అధ్యక్ష అభ్యర్థిత్వానికి అవసరమైన ఓట్లు ఆమెకు లభించినట్టు డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ప్రకటించింది. 4 వేల మంది డెలిగేట్లు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్టు వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఢీకొననున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.
