భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ఏంజెల్స్ మాజీ మేయర్, అధ్యక్షుడు జో బైడెన్ సన్నిహితుడైన ఎరిక్ గార్సెట్టీ ప్రమాణం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగిన కార్యక్రమంలో ఆయనతో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ప్రమాణ స్వీకారం చేయించారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన గార్సెట్టీ అధ్యక్షుడు బైడెన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు. బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గార్సెట్టీ అమెరికా నేవీలో అధికారిగా 12 ఏళ్లపాటు పని చేశారు. 2013లో లాస్ఏంజెల్స్ మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో లాస్ఏంజెల్స్ వందేళ్ల చరిత్రలో ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా, తొలి యూదు జాతీయుడిగా ఎరిక్ చరిత్రలో నిలిచారు. తొమ్మిదేళ్లపాటు ఆయన మేయర్‌గా పని చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గార్సెట్టి భార్య అమీ వీక్‌ల్యాండ్, తండ్రి గిల్ గార్సెట్టి, తల్లి సుకే గార్సెట్టి, అత్తగారు డీ వీక్‌ల్యాండ్ , అనేక ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.