హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నది కంగనా రనౌత్. ఓ హారర్ ఫిల్మ్‌లో ఆమె నటిస్తోంది. బ్లెస్డ్ బీ ద ఈవిల్ చిత్రంలో కంగనా నటించనున్నది. తనూ వెడ్స్ మనూ, ఫ్యాషన్, క్వీన్, తలైవీ లాంటి చిత్రాల్లో నటించిన బాలీవుడ్ క్వీన్ ఇప్పుడు హాలీవుడ్‌లో తన పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నది. స్కార్లెట్ రోజ స్టాలోన్‌తో కలిసి కంగనా ఆ చిత్రంలో తన పాత్రను పోషించనున్నది. యాక్షన్ హీరో సూపర్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్ కుమార్తే స్కార్లెట్ రోజ్ స్టాలోన్.ఈ ఫిల్మ్‌లో టీన్ వోల్ఫ్ నటుడు టైలర్ పోసే కూడా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి అనురాగ్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీన్ ప్లే గాథ తివారీ. ఈ చిత్రాన్ని ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేయనున్నారు. హారర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఈ వేసవిలోనే షూటింగ్ ప్రారంభంకానున్నది. విదేశీ చిత్రాలపై 100 శాతం పన్ను వసూల్ చేయనున్నట్లు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని అమెరికాలనే షూట్ చేయనున్నారు.
