సూర్య హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ కంగువ. శివ దర్శకుడు. స్టూడియోగ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కావాల్సిన ఉంది. గురువారం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఓ రహస్య దీవిలో రెండు గిరిజన తెగల మధ్య జరిగిన పోరాటం ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరో సూర్య యుద్ధవీరుడిగా కనిపించనున్నారు. అతని ప్రత్యర్థిగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పవర్‌ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్, రచన-దర్శకత్వం: శివ.