Skip to main content

Namaste NRI

ఆ బాధ్యతతో చేసిన చిత్రమే కంగువా

సూర్య కథానాయకుడిగా రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం కంగువా. శివ దర్శకుడు. జ్ఞానవేల్‌రాజా నిర్మాత. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకు లతో నా బంధం ప్రత్యేకం. మా రక్తం మీ రక్తం వేరుకాదు. మనమంతా ఒక్కటే. రీసెంట్‌గా నా రీరిలీజ్‌ మూవీ సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ని మీరు ఆదరించిన తీరుకు నా కళ్లు చెమ్మగిల్లాయి అన్నారు.

 గతంలో మీరు చూడని అనుభూతిని పొందుతారు. దర్శకుడు శివ వన్‌మ్యాన్‌ ఆర్మీగా పనిచేసి అద్భుతంగా ఈ సినిమా తీశారు. ఆయనతో వర్క్‌ని ప్రతి రోజూ ఎంజాయ్‌ చేశాను. మీకు అద్భుతమైన అనుభూతినివ్వడానికి రెండేళ్లపాటు కష్టపడి చేసిన సినిమా ఇది. వెట్రి ఛాయాగ్రహణం, దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ఈ సందర్భంగా రీజినల్‌ ఫిల్మ్‌ని గ్లోబల్‌ ఫిల్మ్‌ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళిగారికి థాంక్స్‌ చెబుతున్నాను. ఇది రీజనల్‌ ఫిల్మ్‌ కాదు. ఇండియన్‌ ఫిల్మ్‌. తనవారికోసం, తన దేశంలో నిలబడ్డ ఓ వారియర్‌ కథ ఇది. నవంబర్‌ 14న వస్తుంది. చూసి ఎంజాయ్‌ చేయండి అని అన్నారు. పీరియాడిక్‌ కథాంశం తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని దర్శకుడు శివ, నిర్మాత జ్ఞానవేల్‌ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News