Skip to main content

Namaste NRI

గొప్ప సినిమా ఇవ్వాలనే కంగువా చేశా :  సూర్య

సూర్య కథానాయకుడిగా రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం కంగువా. శివ దర్శకుడు. జ్ఞానవేల్‌రాజా నిర్మాత. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వైజాగ్‌లో జరిగింది. ఈ సందర్భంగా సూర్య మాట్లాడారు. కంగువా డబ్బు కోసం చేసిన సినిమా కాదు. మీ అందరికీ ఒక గొప్ప సినిమా ఇవ్వాలనే తలంపుతో చేసిన సినిమా. సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. నేను కంగువా లాంటి బిగ్‌ మూవీ చేసేందుకు నా వైఫ్‌ జ్యోతిక సపోర్ట్‌ ఎంతో ఉంది అని అన్నారు.

 ప్రతి దర్శకుడికీ ఒక ఎపిక్‌ మూవీ చేయాలనుంటుందని, తనకు అలాంటి సినిమానే కంగువా అని, అద్భుత మైన టీమ్‌ దొరకడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని దర్శకుడు శివ అన్నారు. రాజమౌళి స్పూర్తితోనే కంగువా చేశామని నిర్మాత జ్ఞానవేల్‌ రాజా చెప్పారు. అతిథిగా విచ్చేసిన ఏపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇంకా హీరో సందీప్‌కిషన్‌, నటుడు అవినాష్‌, రైటర్‌ రాకేందు మౌళి కూడా మాట్లాడారు. నవంబర్‌ 14న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events