అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటిస్తున్న చిత్రం బ్యూటీ. జేఎస్‌ఎస్ వర్ధన్ దర్శకుడు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలు. ఇటీవల ఈ సినిమా నుంచి కన్నమ్మ కన్నమ్మ అంటూ సాగే ప్రేమగీతాన్ని విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ గీతాన్ని సనారే రచించారు. అందమైన ప్రేమ భావాలకు అద్దం పడుతూ ఈ పాట సాగింది.

నాయకానాయికల మధ్య కెమిస్ట్రీతో పాటు విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని, ఓ స్కూటీ చుట్టూ కథ నడుస్తుందని, హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయని మేకర్స్ తెలిపారు. నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి, నిర్మాణం: వానరా సెల్యూలాయిడ్స్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్డూడియోస్, సంగీతం: విజయ్ బుల్గానిన్, రచన-దర్శకత్వం: వర్ధన్.
