Namaste NRI

మిస్టర్ ఇడియట్ నుంచి కాంతార కాంతార.. సాంగ్

హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడైన మాధవ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం మిస్టర్‌ ఇడియట్‌. సిమ్రాన్‌శర్మ కథానాయిక. గౌరి రోణంకి దర్శకత్వంలో జె.జె.ఆర్‌.రవిచంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కాంతారా.. కాంతారా.. అంటూ సాగే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను అనూప్‌ రూబెన్స్‌ స్వరపరచగా, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. కాలేజ్‌లో హీరోయిన్‌ను టీజ్‌ చేస్తూ హీరో ఈ పాట పాడతాడనీ, యువతరాన్నికి నచ్చే సినిమా ఇదని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శ్యామ్‌, వంశీ, కెమెరా: రామ్‌రెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress