Skip to main content

Namaste NRI

తిరగబడరసామీ సెలబ్రేషన్‌ సాంగ్‌

రాజ్‌తరుణ్‌, మాల్వి మల్హోత్రా జంటగా నటిస్తున్న చిత్రం తిరగబడరసామీ. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకుడు. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. మన్నారా చోప్రా, మకరంద్‌ దేశ్‌పాండే, రఘుబాబు, జాన్‌ విజయ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. తాజాగా ఈ సినిమా నుంచి సెలబ్రేషన్‌ సాంగ్‌ను విడుదల చేశారు. బేబీ స్వరపరచిన ఈ పాటను లిప్సికా భాష్యం, అదితి బావరాజు, చైతు సత్సంగి ఆలపించారు. సుద్దాల అశోక్‌తేజ ఈ గీతాన్ని రచించారు. ప్రేమ బంధాన్ని ఓ ఉత్సవంలా అభివర్ణిస్తూ ఈ పాట సాగింది. విజువల్స్‌ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. రొమాన్స్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌, యాక్షన్‌ అంశాలతో ఆకట్టుకునే చిత్రమిదని చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరిలో 23న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జవహర్‌ రెడ్డి, సంగీతం: జేబీ, రచన-దర్శకత్వం: ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి.

Social Share Spread Message

Latest News