తమ దేశంలో సంతానోత్పత్తిని పెంచడానికి రష్యా పలు చర్యలు చేపడుతున్నది. దేశ వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియా అధికారులు ఒక వినూత్న ఆఫర్‌ను ప్రకటించారు. స్థానిక యూనివర్సిటీ, కాలేజీలలో చదివే 25 ఏండ్ల లోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డను కనుక ప్రసవిస్తే వారికి రూ.92 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.దేశంలో సంతానోత్పత్తి రేటును పెంచడానికి ప్రవేశపెట్టే ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.
ఇప్పటికే రష్యా, దాని రీజియన్ ప్రాంతాలు జననాల రేటును పెంచడానికి పలు చర్యలు చేపట్టాయి. ఇటీవల ఉక్రెయిన్‌తో యుద్ధంతో రష్యాలోని పలువురు యువకులు మరణించగా, బలవంతంగా సైన్యంలోకి తీసుకుం టారన్న భయంతో చాలామంది దేశాన్ని వదిలి పారిపోయారు. ఇప్పటికే దేశంలో గర్భనిరోధక సాధనాలైన కండోమ్‌లు, మాత్రలు తదితర వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. కాగా, ప్రతి రష్యా మహిళ 8 మందికి జన్మనివ్వాలని గత ఏడాది డిసెంబర్‌లో పుతిన్ విజ్ఞప్తి చేశారు.