Namaste NRI

తమ్ముడు నుంచి జై బగళాముఖీ  సాంగ్ రిలీజ్

నితిన్‌ కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం తమ్ముడు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. జై బగళాముఖీ అనే పాటను విడుదల చేశారు. జై బగళాముఖీ, జై శివనాయకీ, జై వనరూపిణీ, వీర విహారిణి, సర్వజీవ సంరక్షిణి జననీ అంటూ అమ్మవారి మహిమను కీర్తిస్తూ ఈ గీతం సాగింది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ పాటను రచించారు. గ్రామ దేవతకు సంబంధించిన జాతర నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించామని, కుటుంబ అనుబంధాలకు దర్పణంలా ఈ సినిమా కథ ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్‌ తదితరులు చిత్ర తారాగణం. జూలై 4న విడుదలకానుంది. 

Social Share Spread Message

Latest News