కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు కర్నాటక రత్న అవార్డును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. మరణానంతరం ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డుకు ఎంపికైనవారిలో పునీత్ ఐదో వ్యక్తి. 1992లో కర్నాటక రత్న మొదటి అవార్డుకు పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవగా పేరున్న దివంగత నటుడు రాజ్‌కుమార్ ఎంపిక కావడం గమనార్హం. పునీత నామనా పేరుతో ఏర్పాటు చేసిన సంతాప సభలో బొమ్మై ఈ ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రులు బిఎస్ యడియూరప్ప, సిద్ధరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డికె శివకుమార్ స్వాగతించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)