కార్తీక్ రాజు, త్వరిత నగర్ జంటగా అంజీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దండమూడి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. అలీ, నందిని రాయ్, భద్రం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అవనింద్ర కుమార్ క్లాప్ కొట్టగా మనో కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆకాష్ పూరి గౌరవ దర్శకత్వం వహించారు. భాస్కరభట్ల స్క్రిప్ట్ అందించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ సామాజిక అంశాల్ని స్పృశిస్తూ సాగే ఓ నేర నేపథ్య కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఈనెల 14 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది అన్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. ప్రేమ, యాక్షన్, క్రైమ్ ఇలా అన్ని అంశాలు మిళితమై ఉంటాయి అన్నారు హీరో కార్తీక్ రాజు. దండమూడి అవనింద్ర కుమార్ మాట్లాడుతూ 40 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయాలనుకుంటున్నాం అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిసాయి. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. మురళీమోహన్ రెడ్డి, సంగీతం: అనుదీప్ దేవ్.