Skip to main content

Namaste NRI

కార్తీక్ రాజు హస్తినాపురం మూవీ మొదలైంది

కార్తీక్‌ రాజు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హస్తినాపురం. రాజా గండ్రోతు దర్శకుడు. కాసు రమేశ్‌ నిర్మాత. ఈ చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు క్లాప్‌ ఇవ్వగా, నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచాన్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు వీయన్‌ ఆదిత్య స్క్రిప్ట్‌ని అందించారు.

సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. టైటిల్‌ ఎంత పాజిటివ్‌గా ఉందో, సినిమా కూడా అంతే పాజిటివ్‌గా ఉంటుందని, మంచి కథతో, మంచి టీమ్‌తో వస్తున్నామని దర్శకుడు చెప్పారు. దమ్మున్న కథ కాబట్టే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాత చెప్పారు. దర్శకుడు అద్భుతమైన కథ రాసుకున్నాడని, విభిన్నమైన కథాంశంతో రూపొందనున్న సినిమా ఇదని కార్తీక్‌ రాజు తెలిపారు.

Social Share Spread Message

Latest News