Namaste NRI

కార్తికేయ కొత్త సినిమా షురూ

కార్తికేయ నేహాశెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లాప్‌న్వివగా, హీరో కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్విఛాన్‌ చేశారు. గోదావరి నేపథ్యంలో కథ నడుస్తుంది. రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టాం. ఉభయ గోదావరి జిల్లాలు, యానాం పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతాం. ఈ సినిమాలో స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఓ పాట రాశారు. ఆయన రాసిన ఆఖరు పాటే ఇదే అని నిర్మాత తెలిపారు. ఈ దర్శకుడు మాట్లాడుతూ డ్రామా, కామెడీ కలబోతగా రూపొందిస్తున్న డ్రామెడీ జోనర్‌ చిత్రమిది. ఎవరు ఏమనుకున్నా తనదైన దారిలో వెళ్లే యువకుడి జీవిత ప్రయాణమేమిటన్నదే చిత్ర  ఇతివృత్తం అన్నారు. అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు మరణ, ఎల్బీశ్రీరామ్‌, ఆటో రామ్‌ప్రసాద్‌ కీలక పాత్రలు పోషించారు.  ఈ చిత్రానికి కెమెరా: సన్నీ, ఎడిటర్‌: విప్లవ్‌ న్యాసదం, సంగీతం: మణిశర్మ, సహనిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్‌ గున్నల, సమర్పణ: సి.యువరాజ్‌, రచన` దరక్వతక్వం: క్లాక్స్‌. క్లాక్స్‌ దర్శకుడు. లౌక్య ఎంటరటైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్రబెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events