
తాజ్ (Telugu Association of Japan) అధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా జపాన్ లో ఆదివారం, నవంబర్ 24 న వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. తాజ్ ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది. హిఘశి ఓజిమా స్టేషన్ సమీపం లోని ఓజిమ కోమత్సుగువ పార్క్ నందు నిర్వహించారు.ఈ వేడుక లో పిల్లలు మరియు పెద్దలువిందులో పాల్గొని ఆట పాటలతో సంతోషంగా గడిపారు.వనభోజనాల కార్యక్రమానికి సహకరించిన అందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.

