Namaste NRI

దుబాయ్, రాస్ అల్ ఖైమాలోని తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు

దుబాయ్‌,  రాస్‌  అల్‌ ఖైమాలోని ప్రవాసీ తెలుగు కుటుంబాలు తెలుగు తరంగిణి, తెలుగు అసోసియేషన్‌ సంఘాల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.  కార్తీక మాసంలో ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసే దేవుడి ఆరాధాన విశిష్టమైంది.  కార్తీకంలో శివుడికీ అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పని లేదు. కార్తీకంలో వివిధ దేశాల్లోని తెలుగు కుటుంబాలు ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్టు కార్తీక కర్యవ్యాన్ని తప్పక నిర్వహిస్తారు.  రాస్‌ అల్‌ ఖైమాలోని సువిశాలమైన అల్‌ సఖర్‌ పార్కులోజరిగిన ఈ కార్యక్రమంలో తులసి, ఉసిరి, మారేడు, అశ్వత్ధ తదితర దేవత వృక్షాలను శోరాని సమకూర్చుగా దానికి అందరు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.  తులసీ మాతకు హారితి ఇచ్చి కార్తీక దీపాలను వెలిగించి అనంతరం సురేశ్‌, శోభారాణిల కూతురు పదిహేనేళ్ల కుమారి భార్గవి శ్లోక పఠనంతో అక్కడి వారి  పరవశించిపోయారు.  అందరు కలిసి అరిటాకులలో చేసిన సహపంక్తి భోజనాలు ఆత్మీయతను పంచాయి.

 తన వాక్చాతుర్యంతో మాటాల గారడిగాపేరోందిదుబాయిలో వివిధతెలుగు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించే ముసునూరి మైథిలీమోహన్ఇక్కడ కూడా తనచరుతతో సందర్భానుసారంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఆహుతులను ఉత్సాహపరిచారు. డమ్మాబొట్టుపెడుతా అనే కార్యక్రమం అందర్నీ ఆకర్షించగా అందులో కృష్ణప్రియ, శ్రీలతప్రథమ, ద్వితీయ బహుమతులను గెలుచుకున్నారు. బాండ్బంధన్లో ఆశారాణి, పావని విజయలక్ష్మి, ఫ్యాన్సీ డ్రెస్పోటిలలో సహాస్ర,  పునవ్, జాస్వీన్లు బెలూన్పోటీలలో అంశులా, గోపాల్, రాణి, వెంకట్, సతీష్, దివ్య, బాలురబెలూన్పోటీలలోఅభినవ్ ఇతర పోటీలలో విజేతలుగా నిలిచిన అఖిల, హేమ, భువనేశ్, మెహర్శాశంక్  కు బహుమతులు ప్రదానం చేశారు. మోహన్, దర్శికోకాసత్యానంద కోశాధికారి చామర్తి రాజేశ్దిరిశాల ప్రసాద్తెలు గుఅసోసియేషన్ప క్షానదినేష్, మసీయోద్దీన్, బలుసవివేకానంద తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను  పరిశీలించారు.  హైదరాబాద్లోని శ్రీవాసవి గ్రూప్, జాయ్లు కాస్, మల్బా ర్గోల్డ్స్పాన్సర్లుగా  వ్యవహరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress