యశ్వంత్, సాయితేజ, ఆరుషి, నిఖిల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైం ది. ఊర శ్రీనివాస్ దర్శకుడు. కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ పతాకంపై పోతురాజ్ నర్సింహారావు, కె.సాయితేజ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌నివ్వగా, రచయిత బిక్కి కృష్ణ కెమెరా స్విఛాన్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశమిదని, అందరిని ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా ద్వారా తమ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నామని నిర్మాత పోతురాజు నర్సింహా రావు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి.అమర్, సంగీతం: శ్రీధర్ ఆత్రేయ, సంభాషణలు: దాసరి వెంకటకృష్ణ, దర్శకుడు: ఊర శ్రీను.