టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడిగా కాసర్ల నాగేందర్ రెడ్డిని మూడోసారి అధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. కవిత నివాసంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ చేస్తున్న కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ నాగేందర్ రెడ్డి నూతన నియామక ఉత్తర్వులు అందజేశారు. 2016లో ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ని స్థాపించి మొదటి సారి అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేందర్ రెడ్డి ఆస్ట్రేలియా వ్యాప్తంగా గులాబీ జెండాని ఎగరవేసి అత్యధిక సభ్యత్వ నమోదును చేయించారు. పార్టీ కోర్ కమిటీలో డా.అనిల్ రావు చీటీ, రాజేష్ గిరి రాపోలు, సాయి రామ్ ఉప్పు, రవి శంకర్ దూపాటి, రవీందర్, రవి సాయల, రాకేష్ విశ్వామిత్ర, సన్నీ గౌడ్, సతీష్, ప్రవీణ్, సునిల్, జస్వంత్, సంగీత, విక్రమ్, పరశురామ్, నరేష్ రెడ్డితో పాటు దాదాపు 150 మందితో భారీ కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి మళ్లీ నియమించిన కవిత, మహేష్ బిగాలకు నరేందర్ రెడ్డి, నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)