Namaste NRI

13న కట్టప్ప జడ్జిమెంట్‌

సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం తీర్పుగల్‌ విర్కపడుమ్‌..కట్టప్ప జడ్జిమెంట్‌ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ధెరన్‌ దర్శకత్వం.  అపోలో ప్రొడక్షన్స్‌ పతాకంపై రావూరి వెంకటస్వామి ఈ నెల 13న తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఓ డాక్టర్‌ తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే చిత్ర ఇతివృత్తమని, సత్యరాజ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది.

బాహుబలిలో కట్టప్ప పాత్ర ద్వారా సత్యరాజ్‌ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారని, అందుకే ఈ చిత్రానికి కట్టప్ప జడ్జిమెంట్‌ అనే టైటిల్‌ను పెట్టామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రంలో స్మృతి వెంకట్‌, హరీష్‌ ఉత్తమన్‌, మధుసూదన్‌ రావు, రవిప్రసాద్‌ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events