Skip to main content

Namaste NRI

భారత్‌ కీలక నిర్ణయం … ఆగస్ట్‌ 25 నుంచి అమెరికాకు

భారత్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ట్రంప్‌ సుంకాల నేపథ్యంలో ఆగస్ట్‌ 25 నుంచి అమెరికాకు పోస్టల్‌ సేవలు నిలిపివేయనున్నది. ఈ మేరకు తపాలా శాఖ ప్రకటించింది. అమెరికా సుంకాలకు సంబంధించిన మార్పులు ఈ నెల చివరి నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 25 నుంచి ఆ దేశానికి పోస్టల్ కన్సైన్‌మెంట్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌  వెల్లడించింది.

కాగా, అమెరికా విధించిన టారిఫ్‌ డ్యూటీ కలెక్షన్‌ ప్రక్రియపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆగస్ట్‌ 25 తర్వాత అమెరికాకు పోస్టల్ పార్శిల్స్‌ను తీసుకెళ్లబోమని పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా ఆగస్ట్‌ 25 నుంచి వంద డాలర్లు వరకు విలువైన లేఖలు, పత్రాలు, బహుమతి వస్తువులు మినహా మిగతా అన్ని రకాల వస్తువుల బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది.

Social Share Spread Message

Latest News